బస్సులో చనిపోయిన కండక్టర్ కుటుంబానికి రూ.50లక్షలు పరిహారం

శనివారం, 20 నవంబరు 2021 (11:51 IST)
కడపను వరదలు ముంచెత్తాయి. అన్నమయ్య జలాశయం ప్రమాదంలో పడింది. నీటికి బయటికి పంపడంతో ఐదో గేటు సాంకేతిక లోపంతో మొరాయించింది. అంతే ఇక జరగాల్సింది జరిగిపోయింది. ఇంకా ముందు చూపు కొరవడటంతో వరద ముంపు ముంచేసినట్లు తెలుస్తోంది. 
 
ఈ వరద కాస్త కడప- రేణిగుంట జాతీయ రహదారిలోకి వస్తుందని ఎవరూ గుర్తించ లేదు. ఆర్టీసీ  బస్సులు ప్రమాదంలో చిక్కుకునే వరకు యంత్రాంగం స్పందించలేదు. అంతే రాజం పేట వరదలో ఆర్టీసీ బస్సులో ముగ్గురు మృతి చెందారు. 
 
ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. కడప జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బస్సులో చనిపోయిన కండక్టర్ కుటుంబానికి రూ.50లక్షలు పరిహారం ప్రకటించారు. మరో ఇద్దరు ప్రయాణీకుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. 
 
కడప ఆర్టీసీ గ్యారేజ్‌కు రూ.10 కోట్లతో త్వరలో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 1800 ఆర్టీసీ సర్వీసులకు రద్దు చేసినట్లు చెప్పారు. కడప, రాజంపేట మీదుగా తిరుపతికి ఇవాళ సర్వీసులు రద్దు చేసినట్లు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు