ఈ శాఖ పరిధిలోకి కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, క్షత్రియ, కాపు, ఆర్యవైశ్య కార్పొరేషన్లను తీసుకువచ్చారు. జైనులు, సిక్కుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తూ మరో రెండు జీవోలను జారీ చేసింది.
కాగా, రాష్ట్రంలోని పేదల సంక్షేమం కోసం నవరత్నాల పేరుతో ప్రభుత్వం వివిధ రకాలైన పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న విషయం తెల్సిందే. ఈ పథకాలతో వేలాది మంది లబ్దిపొందుతున్నారు. ఇపుడ్ అగ్రవర్ణ పేదల కోసం ఒక సంక్షేమ శాఖను ప్రవేశపెట్టడం గమనార్హం.