మీడియా సమావేశాలు నిర్వహించరాదని పెద్దిరెడ్డిపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమినరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ విధించిన ఆంక్షలను చెల్లుబాటుకావని హైకోర్టు స్పష్టం చేసింది. మంత్రి మీడియాతో మాట్లాడేందుకు అనుమతినిస్తూ బుధవారం తీర్పును వెలువరించింది. పంచయతీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డిపై నిర్బంధం విధిస్తూ, మీడియాతో మాట్లాడకుండా నిమ్మగడ్డ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
దీనిపై మంత్రి పెద్దిరెడ్డి డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన డివిజన్ బెంచ్.. మీడియాతో మాట్లాడకుండా ఉండాలంటూ ఎస్‌ఈసీ జారీచేసిన ఆంక్షలను తప్పుపట్టింది. మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది. దీంతో మంత్రి పెద్దిరెడ్డికి స్వేచ్ఛ లభించినట్టయింది.