సంగం డెయిరీ కేసు : సర్కారుకు మరోమారు మొట్టిక్కాయ

బుధవారం, 1 సెప్టెంబరు 2021 (16:04 IST)
గుంటూరు జిల్లాలోని సంగం డెయిరీ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరోమారు మొట్టిక్కాయ పడింది. ఈ డెయిరీని హస్తగతం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలకు చుక్కెదురైంది. సంగం డెయిరీని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోరాదంటూ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అదేసమయంలో గతంలో సింగిల్‌ జడ్జీ ఇచ్చిన తీర్పును సమర్థించిన ధర్మాసనం ప్రభుత్వం దాఖలు చేసిన రిట్‌ పిటీషన్‌ను తోసిపుచ్చింది. 
 
ఈ డెయిరీని స్వాధీనం చేసుకునే విషయంపై ఈ ఏడాది ఏప్రిల్‌ 27న ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలును నిలిపివేయాలని ఆదేశించింది. ఈ జీవో విషయంలో హైకోర్టు సింగిల్‌ జడ్జి జస్టిస్‌ సోమయాజులు ఇచ్చిన తీర్పును డివిజనల్‌ బెంచ్‌ సమర్దించింది. సింగిల్‌ జడ్జి తీర్పును సవాల్‌ చేస్తూ ధర్మాసం ముందు ప్రభుత్వం దాఖలు చేసిన రిట్‌ అపీల్‌ను తిరస్కరించింది. సంగం డెయిరీ విషయంలో దాఖలైన ఇతర ఇంప్లీడ్‌ పిటిషన్లనూ తోసిపుచ్చింది.
 
సంగం డెయిరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సంగం మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ డైరెక్టర్ ధర్మారావు.. హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెల్సిందే. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు.. పై విధంగా ఆదేశాలు జారీచేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు