ఈ తీర్పును నాగమారుతి హైకోర్టులో సవాలు చేయగా, తాజాగా విచారణ జరిపిన జస్టిస్ రవినాథ్ తిల్హారీ, జస్టిస్ ఎన్.విజయ్‌తో కూడిన ధర్మాసనం పిటిషనరు వ్యతిరేకంగా తీర్పు వెలువరించింది. దివ్యాంగుల కోటా కిందకు రానని తెలిసి కూడా నకిలీ ధ్రువీకరణ పత్రంతో ఉద్యోగం పొందారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెను సర్వీసు నుంచి తొలగిస్తూ డీఈవో ఇచ్చిన ఉత్తర్వుల్లో ట్రైబ్యునల్ జోక్యం చేసుకోకుండా ఉండాల్సిందని అభిప్రాయపడింది. డీఈవో ఉత్తర్వులను సమర్థించడంతోపాటు ఖర్చుల కింద లక్ష రూపాయలు చెల్లించాలని ఆదేశించింది.