మిథున్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు... సరెండర్‌కు కూడా నో టైమ్..

ఠాగూర్

శుక్రవారం, 18 జులై 2025 (14:24 IST)
వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురుదైంది. ఏపీలో గత వైకాపా ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు అపెక్స్ కోర్టు నిరాకరించింది. అలాగే, ఈ కేసులో లొంగిపోయేందుకు కూడా అదనపు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. పనిలోపనిగా ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కూడా అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.
 
కాగా, ఈ కేసులో ఆయన ఏ4గా ఉన్న విషయం తెల్సిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన ముందుగా ఏపీ హైకోర్టులో ప్రయత్నించారు. అయితే, ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు తిరస్కరించింది. ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు మంగళవారు తీర్పునిచ్చిన విషయం తెల్సిందే. హైకోర్టు తీర్పును ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. కానీ, అక్కడ కూడా మిథున్ రెడ్డికి చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. 
 
మరోవైపు, మిథున్ రెడ్డి దేశం విడిచిపోకుండా, ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా, ప్రత్యేక దర్యాప్తు బృందం లుకౌట్ సర్క్యులరు జారీ చేసింది. విదేశాలకు వెళ్లాలంటే అనుమతి తీసుకోవాలని సర్క్యులర్‌లో సిట్ అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి కీలక నిందితుడుగా ఉన్నారు కనుకన ఆయన విదేశాలకు పారిపోకుండా అడ్డుకునేందుకు ఆయనపై లుకౌట్ నోటీసులు జారీచేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు