చంద్రబాబు - అచ్చెన్నాయుడు రాజీనామా చేయాలి : మంత్రి దాడిశెట్టి రాజా

గురువారం, 13 అక్టోబరు 2022 (08:53 IST)
తమ ప్రభుత్వం తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయంలో ఏమాత్రం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
వీరిలో ఒక్క గెలిచినా మేం వికేంద్రీకరణపై మాట్లాడబోమన్నారు. లేకుంటే చంద్రబాబు, అచ్చెన్నాయుడులు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళాలి. వీరిలో ఏ ఒక్కరు గెలిచినా వికేంద్రీకరణను ప్రజలు కోరుకోవట్లేదని మేం భావిస్తామన్నారు. 
 
ఆయన కాకినాడ జిల్లా తునిలో విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో మూడు ప్రాంతాల ప్రజలు వికేంద్రీకరణ కోరుకుంటున్నారని, వారి మనోభావాలకు అనుగుణంగా ఈ నెల 15న విశాఖలో గర్జన తలపెట్టామన్నారు. అయితే, అదే రోజున జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర యాత్రను తలపెట్టారన్నారు. ఇది కేవలం తాము తలపెట్టిన గర్జన నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికేనని ఆయన విమర్శించారు. 
 
'ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా మేం కార్యక్రమాలు చేస్తుంటే ఎంత అహంభావం... ఎవరి కోసం గర్జన అని పవన్‌ అంటారా? 5 కోట్ల మంది ప్రజలకు అభిప్రాయాలు చెప్పే హక్కు లేదా?' అని ఆయన ప్రశ్నించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు