కొత్త రేషన్ కార్డులపై ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేవైసీ నమోదు పూర్తయిన తర్వాత కొత్త రేషన్ కార్డులపై దృష్టిపెడతామన్నారు. ఈ నెలాఖరులోగా ఈ కేవైసీ పూర్తి చేస్తామని తెలిపారు. కుటుంబ సభ్యుల వివరాలు అన్ని ఈ కోర్డులోనే ఉంటాయని, రేషన్ కార్డు అనికాకుండా ఫ్యామిలీ కార్డుగా అది ఉంటుందన్నారు. ఏటీఎం కార్డు తరహాలోనే స్మార్ట్ రేషన్ కార్డు ఇస్తామని వెల్లడించారు.
బియ్యం అక్రమ రవాణాలో 65 వేల టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వెహికల్స్ సీజ్ చెయ్యమని కూడా చెప్పామని, గతంలో ఎన్నడూ లేనివిధంగా రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించే వాహనాలను సీజ్ చేస్తున్నామని ఆయన తెలిపారు. కాకినాడలో మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ ఎప్పటికపుడు తనిఖీలు జరుగుతున్నాయన్నారు. దీపం పథకం గత దీపావళి రోజు ప్రారంభమైందన్నారు. దీపం పథకం మొదటి దశలో 99 లక్షలకు మంది లబ్దిదారులు లబ్ధి పొందారని వెల్లడించారు.