రాజమండ్రి వేదికగా సినీరంగంపై పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన !

డీవీ

శుక్రవారం, 3 జనవరి 2025 (10:43 IST)
Pawan- gamchanger poster
రామ్ చరణ్ సినిమా గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 4వతేదీ శనివారంనాడు జరగనుంది. ముందుగా విజయవాడలో 4వ తేదీన భారీగా ఫంక్షన్ జరపాలని నిర్మాత దిల్ రాజు కొద్దిరోజుల క్రితం సూచాయగా ప్రకటించారు. కానీ పవన్ అభిమానులు, చరణ్ అభిమానులు అభీష్టం మేరకు రాజమండ్రి లో చేయడానికి నిర్ణయించారు. రాజమండ్రిలో ఫంక్షన్ జరగనున్నట్లు నిన్న జరిగిన ట్రైలర్ ఈవెంట్ లో యాంకర్ సుమ వెల్లడించారు. ఇందుకు ప్రముఖులు, పోలీసు యంత్రాంగం సహకారంతో స్టేజీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారీ సెక్యూరిటీతో ఈ వేడుక జరగనుంది.
 
ఇక ఈ వేడుకలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి పలు కీలక నిర్ణయాలు చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ పేషీ నుంచి వచ్చిన సమాచారం. కేవలం గేమ్ ఛేంజర్ గురించి మాత్రమే మాట్లాడడం సరైనది కూడా కాదని ఆయనకూ తెలుసు. ఇప్పటికే తెలంగాణలో తెలుగు చలన చిత్ర రంగంలోని సాధక బాధలు ముఖ్యమంత్రి రేవత్ రెడ్డికి దిల్ రాజు ఆధ్వర్యంలో కమిటీ తెలియజేసింది. ఆయన సానుకూలంగా స్పందిస్తూనే ఓ కమిటీ వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే టికెట్ల రేట్లు, బెనిఫిట్ షో లు మాత్రం వుండవని ఫుష్ప 2 ఘటన అనంతరం ఆయన అసెంబ్లీ చెప్పాడు.
 
కానీ ఆంధప్రదేశ్ లో చలన చిత్రరంగం పరిశ్రమగురించి ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే అమరావతి లో చలన చిత్రరంగానిని అనుకూలంగా చేసేందుకు పలు స్టూడియో నిర్మాణాలు జరగాలనీ, అందమైన లొకేషన్లలో షూటింగ్ లకు రాయితీ కూడా ఇవ్వనున్నట్లు వార్తలు కూడా బయటకు వచ్చాయి. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి వ్యతిరేక కనిపించలేదు. కనుక ఇటీవలే పవన్ కళ్యాణ్ ను దిల్ రాజు కలిసి గేమ్ ఛేంజర్ ఈవెంట్ ను రావాల్సిందిగా ఆహ్వానం పలికారు. అప్పుడే ఆంధ్రప్రదేశ్ లో సినిమా రంగం గురించి పలు విషయాలు చర్చకు వచ్చాయని దిల్ రాజు సన్నిహితులు తెలియజేశారు. సో. రేపు రాజమండ్రి వేదికగా పలు సినిరంగ అంశాల గురించి పవన్ మంత్రి హోదాలో ప్రకటించే అవకాశం వుందని తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు