దిశ చట్టంలోనే లోపం ఉంది. కాబట్టి ఏదో జరుగుతోందని అనటం ఏంటని బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. సభా వ్యవహారాలు ఏదో తెలియని వాళ్లు, మొదటిసారి సభకు వచ్చిన వారు మాట్లాడుతున్నారంటే అర్థం ఉంటుందని బుగ్గన ఎద్దేవా చేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసి ప్రతిపక్ష నాయకుడు కూడా అదే చెప్పటంపై బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం మీద బురద చల్లాలని తప్ప వేరే ఏమైనా అర్థం ఉందా అని బుగ్గన నిలదీశారు. ఇంకా దిశ చట్టమే అమల్లోకే రాలేదు.
దిశ చట్టం నిన్నగాక మొన్న చట్టం అయింది. ఎందుకు గాబరా పడుతున్నారని ప్రతిపక్షాలను స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. ప్రభుత్వాలు మంచి ఉద్దేశంతోనే చట్టాలు తయారు చేస్తాయి. అవి ప్రజలకు రీచ్ కావాలన్నారు. ప్రతిపక్షాల సూచిస్తున్న సూచనలను హోంమంత్రి గారు నోట్ చేసుకొని వాటిని పరిగణలోకి తీసుకోవాలని స్పీకర్ తమ్మినేని సీతారాం సూచించారు.