పవన్ కళ్యాణ్ హిందువు కాదా? మరేంటి?

బుధవారం, 9 సెప్టెంబరు 2020 (21:59 IST)
అంతర్వేది రథం కాలిపోయిన వ్యవహారం కాస్త అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య పెద్ద మాటల యుద్ధానికే కారణమవుతోంది. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా రథాన్ని తగులబెట్టారంటూ హిందూ ధార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నాయి. 
 
ఇప్పటికే అంతర్వేది ఆలయం కాస్త హిందూ ధార్మిక సంఘాల నిరసనలతో అట్టుడుగుతోంది. నిన్న హిందూ సంఘాలు మంత్రులను అడ్డుకుంటే ఈరోజు బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు అంతర్వేదిలో పర్యటించారు.
 
నేరుగా ఆయన అంతర్వేదికి వెళ్లే సమయంలో పోలీసులు మొదట్లో అడ్డుకున్నారు. కానీ ఆయన పర్యటన పూర్తయ్యింది. కానీ బిజెపి పర్యటన తరువాత మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు జనసేన పార్టీ అధినేతపై తీవ్రవ్యాఖ్యలు చేశారు.
 
మొదట్లో క్రిస్టియానిటీని సమర్థించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు హిందువుల మనోభావాల గురించి మాట్లాడుతారా. పవన్ కళ్యాణ్ హిందువా అంటూ ప్రశ్నించారు వెల్లంపల్లి శ్రీనివాసులు. ఇప్పుడీ వ్యవహారం కాస్త పెద్ద దుమారానికి కారణమవుతోంది. జనసేన పార్టీ కార్యకర్తలు మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యలపై భగ్గుమంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు