పవర్ స్టార్‌తో 20 ఏళ్ల క్రితమే ఆ పనిచేశాను.. వకీల్ సాబ్ డైరక్టర్ వేణు శ్రీరామ్

బుధవారం, 9 సెప్టెంబరు 2020 (21:22 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినీ ఇండస్ట్రీలోకి రాకముందే ఆయనతో ప్రకటన కోసం దర్శకత్వం చేసిన అనుభవం వుందని.. యువ డైరెక్టర్ వేణు శ్రీరామ్ అన్నారు. ఇప్పటికే ఓ మై ఫ్రెండ్‌, ఎంసీఏ వంటి చిత్రాలతో దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నాడు యువ డైరెక్టర్ వేణు శ్రీరామ్. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో వకీల్ సాబ్ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్‌లో రీస్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 
 
తాజాగా ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణు శ్రీరామ్ ఓ ఆసక్తికరమైన విషయం తెలిపాడు. పవన్ కళ్యాణ్‌తో 20 ఏళ్ల కిందటే ఉన్న వర్క్ ఎక్స్ పీరియన్స్‌ను షేర్ చేసుకున్నాడు. ఖుషి సినిమా విడుదల తర్వాత పవన్ కళ్యాణ్ పాపులర్ డ్రింక్ కోలా బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించాడు.
 
యాడ్ ఫిల్మ్‌కు వేణుశ్రీరామ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడట. యాడ్ కోసం పవన్ డబ్బింగ్ పనులను పర్యవేక్షించారట వేణుశ్రీరామ్‌. తన ఫేవరెట్ యాక్టర్ తో పని చేయడం కొంత నర్వస్ గా అనిపించినా..ఫ్యాన్ మూవ్ మెంట్ తెగ ఎంజాయ్ చేశానని వేణు శ్రీరామ్‌ చెప్పుకొచ్చాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు