గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన నిమ్మగడ్డ.. వేచిచూస్తున్న గవర్నర్

సోమవారం, 25 జనవరి 2021 (13:55 IST)
ఏపీలో పంచాయతీ ఎన్నికల పంచాయతీ తీవ్రస్థాయికి చేరుకుంది. హైకోర్టు ధర్మాసనం ఆదేశాల మేరకు ఈ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ జారీ చేశారు. కానీ, ప్రభుత్వం మాత్రం ఎన్నికలకు ససేమిరా అంటోంది. పైగా, హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ తీర్పు మరికాసేపట్లో వెలువడనుంది. 
 
అయితే, తాజా పరిణామాలపై వివరించడానికి ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలవాలనుకుంటున్నారు. కానీ, గవర్నర్ కార్యాలయం నుంచి ఆయనకు క్లియరెన్స్ రాలేదు. 
 
నిమ్మగడ్డ మాత్రమే కాదు, రాష్ట్రంలోని పలు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కూడా గవర్నరుతో భేటీ కోసం ప్రయత్నిస్తున్నాయి. అయితే, ఇప్పటివరకు గవర్నర్ ఎవరికీ అపాయింట్‌మెంట్ ఖరారు చేయలేదు. పంచాయతీ ఎన్నికల వ్యవహారం సుప్రీంకోర్టులో ఉన్నందున, తీర్పు వచ్చే వరకు వేచి చూడాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు