ఎస్ఈసీగా లేరు... టీడీపీ కార్యకర్తగా ఉన్నారు : మంత్రి బొత్స

ఆదివారం, 24 జనవరి 2021 (12:27 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోమారు విషంగక్కారు. ఆయన ఎస్ఈసీగా లేరని, టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.
 
ఇదే అంశంపై ఆయన నెల్లూరులో మాట్లాడుతూ, రాజ్యాంగ వ్యవస్థను నడిపే వ్యక్తిలా కాకుండా రాజకీయ నేతగా, పార్టీ నాయకుడిగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమే్‌షకుమార్‌ వ్యవహరిస్తూ రాజ్యాంగ వ్యవస్థకే మచ్చ తెస్తున్నారని ఆరోపించారు. 
 
ఎన్నికల కమిషనర్‌కి అధికారం, బాధ్యత ఉంటాయని రెండింటినీ సమన్వయం చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఈ విషయం కూడా నిమ్మగడ్డకు తెలిసినట్టు లేదన్నారు. 
 
పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి కూడా ఎన్నికల కమిషనరేనన్న విషయాన్ని మరచి మాట్లాడటం సమంజసం కాదన్నారు. కేవలం విలేకరుల సమావేశంలో మాట్లాడేందుకు నిమ్మగడ్డ అద్దాన్ని అడ్డంపెట్టి ఎన్నో జాగ్రత్తలు పాటించారని, అంటే ఆయనొక్కక్కడికేనా ప్రాణం, ప్రజలు, అధికారులు, ఉద్యోగులవి ప్రాణాలు కావా? అని ప్రశ్నించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు