జనసేన నేతలు, పిఠాపురం టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మకు మధ్య గత కొన్ని రోజులుగా కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వర్మ తన ఎక్స్ ఖాతాలో పిఠాపురం జగ్గయ్య కాలనీలో పారిశుధ్యం లోపించిందని ఇందుకు సంబంధించిన వీడియోను వర్మ షేర్ చేశారు.
అధికారుల నిర్లక్ష్యంతో ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అయితే ఈ వీడియో ద్వారా వర్మ స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ను టార్గెట్ చేశారని చర్చ సాగుతోంది.