మీడియాలో ప్రసారమైన ఫుటేజీని పరిశీలించిన ఎన్నికల కమిషన్.. పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం 5 గంటల లోపు వ్యక్తిగతంగా గాని, ప్రతినిధి ద్వారా గాని వివరణ ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది. లేని పక్షంలో తగిన చర్యలు తీసుకోవల్సి ఉంటుందని పేర్కొంది.
వాస్తవానికి గత కొంతకాలంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా, టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు నిమ్మగడ్డను కూడా పిచ్చాసుపత్రికి పంపాలంటూ ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు.