తాను సూపర్ స్టార్ రజనీకాంత్ వీరాభిమానిని అని, ఆయన కోసం కూలీ చిత్రంలో ఆ పని చేసినందుకు తనకు ఎలాంటి ఇబ్బంది అనిపించ లేదని బాలీవుడ్ నటి అమీర్ ఖాన్ వెల్లడించారు. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన తాజా చిత్రం "కూలీ". ఈ నంల 14వ తేదీన విడుదలైంది. ఇందులో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఓ పాత్రను పోషించారు.
ఈ నేపథ్యంలోనే, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అమిర్ ఖాన్ తన పాత్రపై స్పందించారు. "నిజాయతీగా చెప్పాలంటే, 'కూలీ' చిత్రంలో నా పాత్ర రజనీకాంత్‌గారికి బీడీ వెలిగించడం. అలా చేయడం నాకు ఏమాత్రం ఇబ్బందిగా అనిపించలేదు. ఎందుకంటే నేను ఆయనకు పెద్ద అభిమానిని. ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం నా జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. దాన్ని నేను చాలా గౌరవంగా భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.
ఒక బాలీవుడ్ అగ్ర హీరో, మరో భాషలోని సూపర్ స్టార్‌తో కలిసి నటించడంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది రజనీకాంత్ పట్ల ఆయనకున్న గౌరవాన్ని తెలియజేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే, భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ చిత్రం మిశ్రమ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే, కలెక్షన్ల పరంగా కేవలం నాలుగు రోజుల్లో రూ.400 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది.