పిఠాపురంలో అపోలో ఫౌండేషన్.. మోడల్ అంగన్‌వాడీ కేంద్రాలు ప్రారంభం

సెల్వి

బుధవారం, 5 ఫిబ్రవరి 2025 (18:13 IST)
Apollo Foundation
అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు సి. ప్రతాప్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని అపోలో ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురంలో మోడల్ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రారంభించింది. ఈ ఫౌండేషన్ సామాజిక సంక్షేమం వైపు ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తోంది.
 
కొత్తగా ప్రారంభించబడిన మోడల్ అంగన్‌వాడీ కేంద్రాలు బాలింతలు, నవజాత శిశువులకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం, బాల్య సంరక్షణను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. 
 
సమాజాభివృద్ధిలో అపోలో ఫౌండేషన్ చేస్తున్న కృషికి పిఠాపురం ప్రజలు తమ ప్రశంసలు కురిపిస్తున్నారు. తమ ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పిఠాపురం పురోగతిలో ముందుకు సాగుతోందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
మరోవైపు తన సొంత నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. పిఠాపురంని మోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. పిఠాపురంలో వంద పడకల హాస్పిటల్‌కు నిధులు మంజూరు చేయించిన పవన్ కల్యాణ్, ఇచ్చిన మాట ప్రకారం.. పిఠాపురంలో అపోలో హాస్పిటల్స్ ద్వారా ఒక ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు