ఇంకా దిశ పోలీస్ స్టేషన్‌లోనే వన్ స్టాప్ సెంటర్, డీ అడిక్షన్ సెంటర్లు కూడా ఏర్పాటు కావాలన్నారు. ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకాలు వెంటనే పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. దిశ చట్టంపై మీద ప్రతి నెలా సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. దిశ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు తోపాటు ఫోరెన్సిక్ ల్యాబ్‌ల నిర్మాణం, మౌలిక సదుపాయాలను వీలైనంత త్వరగా ఏర్పాటు చేసుకోవాలని సీఎం అన్నారు.
ప్రధానంగా దిశ యాప్‌ను ఎలా వినియోగించాలన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని అన్నారు. దిశ యాక్ట్ అమలుపై క్యాంపు కార్యాలయంలో సిఎం సమీక్ష నిర్వహించారు. దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం, వినియోగించే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చె్పారు.
ఎస్‌ఎంఎస్ సహా వివిధ మార్గాల్లో సమాచారం పంపాలని సీఎం స్పష్టం చేశారు. స్మార్ట్ ఫోన్లలో మాత్రమే కాకుండా అన్ని ఫోన్లలో కూడా దిశ యాప్ సదుపాయాలు ఉండేలా చూడాలని, ఇందుకోసం టెలికాం కంపెనీలతో మాట్లాడాలన్న సీఎం ఆదేశించారు.