ఎర్రబాలెం పంచాయతీ కార్యాలయం వద్ద నాలుగు నెలల పెండింగ్ జీతాలు ఇవ్వాలని కోరుతూ మంగళవారంనాడు ఆందోళన చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ఉద్దేశించి రవి మాట్లాడుతూ.. ఏజెన్సీకి పారిశుద్ధ్య పనులు అప్పగించిన సీఆర్డీఏ అధికారులు ఏజెన్సీ కార్మికులకు సక్రమంగా జీతాలు ఇవ్వకుండా కాల్చుకు తింటుంటే చోద్యం చూడటం ఏమిటని రవి ప్రశ్నించారు.