డీజీపీ ఇంకా ఏమన్నారంటే.. "ప్రజలకు ఏ ఆపద వచ్చినా 100, 112, 104, 108 నంబర్లకు కాల్ చేయాలి. ప్రస్తుత పరిస్థితికి అన్వయించి రోజువారీ జాగ్రత్తలను కూడా జతచేసి సోషల్ మీడియా ద్వారా ప్రజలను భయపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని గుర్తించాం.
లాక్‌డౌన్ తర్వాత పిల్లలు, మహిళలను నేరస్తులు టార్గెట్ చేస్తారంటూ జరుగుతున్న ప్రచారాలను ప్రజలు నమ్మొద్దు. ప్రజల దైనందిన జీవనం, ఇంటి వద్ద భద్రత వంటి అనేక అంశాలకు ముడిపెట్టి వారిని భయపెట్టేలా వదంతులు సృష్టిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం."