ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేకే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఓ క్లారిటీ ఇచ్చారు. ‘హోదాతో సమానమైన సహాయం’ ఎలా ఉంటుంది? నిజంగానే ‘హోదా’లేని లోటు తీరుతుందా? అనే చర్చ మొదలు కాగానే, దీనిపై ఆయన స్పందించారు.
ప్రత్యేక హోదా లభిస్తే, కేంద్ర ప్రాయోజిత పథకాలకు (సీఎస్‌ఎస్) కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులను గ్రాంటుగా, 10 శాతం రుణం రూపంలో ఇస్తుంది. ఈ పది శాతం రుణాన్ని మాత్రం రాష్ట్రం తిరిగి చెల్లిస్తే సరిపోతుంది.