ఇదే విషయాన్ని నిన్ననే తమిళనటుడు ధనుష్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఏఐ వినియోగానికి తాను అభ్యంతరం తెలిపినప్పటికీ సంబంధిత పార్టీలు ఈ విషయంలో ముందుకెళ్లాయంటూ ధనుష్ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో రూపొందించిన క్లైమాక్స్‌తో రాంఝనా సినిమాను రీ రిలీజ్ చేశారు. ఇది ఆ సినిమా ఆత్మనే కోల్పోయేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారాయన.
తెలుగులో కూడా పలు సినిమాలు ఎ.ఐ. టెక్నాలజీతో తీశారు. తీస్తున్నారు. ఆమధ్య రవితేజను యంగ్ లో వుండేలా చేసిన సినిమాలో లెపాలు కనిపించాయి. అదేవిధంగా హరిహరవీరమల్లుతోకూడా పవన్ కళ్యాణ్ గుర్రంపై ఎగిరి తుపాకీతో చేసిన యాక్షన్ సీన్ లో ఆయన ఆర్టిఫిషియల్ గా కనిపించారు. ఇక యూట్యూబ్ లలో వస్తున్న ఎ.ఐ. టెక్నాలజీ సరదాగా చూడానికి బాగుంటుంది. కానీ వెండితెరపై ఆవిష్కరించడం అన్ని వేలలా సరైంది కాదని పలువురు నిర్మాతలు అంగీకరిస్తున్నారు.
కానీ, ఎ.ఐ. టెక్నాలజీ కొన్ని చిత్రాలకే ఉపయోగకరం. ముఖ్యంగా మహావతార్ నరసింహ అనే యానిమేషన్ సినిమాలో హిరణ్యకశ్యపుడు, ప్రహ్లాదుడు కథతో రూపొందించారు. వాటిని టెక్నాలజీ ఊహకందని విధంగా తీశారు. అందులో నరసింహ అవతారం కానీ పోరాట సన్నివేశాలు కానీ ఊహకు అందనంత ఎత్తులో మార్చుకుని థ్రిల్ గురిచేయవచ్చు. కానీ అదే సినిమాను నటీనటులతో చేయాలంటే అంత ఎమోషన్ పండదు అంటూ ఆ చిత్ర దర్శకుడు అశ్విన్ కుమార్ తెలియజేశారు.
హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్ చైతన్య దేశాయ్ నిర్మించారు. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా జూలై 25న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని అందుకొని, భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసి, సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.