Film chamber: కార్మికుల ఫెడరేషన్ వర్సెస్ ఫిలింఛాంబర్ - వేతనాల పెంపుకు నో చెప్పిన దామోదరప్రసాద్

దేవీ

సోమవారం, 4 ఆగస్టు 2025 (07:11 IST)
Fedaration office - damodar prasad
తెలుగు సినీ కార్మికులకు చెందిన 24 శాఖలలో కొన్ని శాఖలకు మినహా అసలైన కార్మికులు తమ వేతనాలు పెంచాలంటూ గత కొద్దినెలలుగా ఫెడరేషన్ కార్యాలయంలో నివేదించారు. ఆదివారంనాడు జరిగిన జనరల్ బాడీలో  తీసుకున్న నిర్ణయం వల్ల తమ వేతనాలలో 30 శాతం పెంచాలనికోరుకున్నారు. అందుకు నిర్మాతలు సరైన నిర్ణయం ప్రకటించకపోవడంతో నేటి నుంచి అనగా సోమవారంనుంచి సమ్మె మొదలుపెట్టారు.

దానితో ఈరోజు ప్రారంభోత్సవాలు అన్నీ ఆగిపోయాయి. అల్లరినరేష్ సినిమా నేడు ప్రారంభం కావాల్సివుంది. అదేవిధంగా ఇతర ప్రాంతాలలో షూటింగ్ లు జరుగుతున్న కార్మికులు తిరిగి వెనక్కు వచ్చేస్తున్నారు. దానితో నిర్మాలకు చాలా నష్టం వాటిల్లుతుంది. 
 
ఇదిలా వుండగా, నేడు సోమవారంనాడు తెలుగు ఫిలింఛాంబర్ లో అత్యవసర సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా K.L. దామోదర ప్రసాద్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి ఓ ప్రకటన విడుదల చేశారు.
 
అందరు నిర్మాతలకు మరియు సంబంధిత నిర్మాణ సంస్థలకు ముఖ్యముగా తెలియజేసేది ఏమనగా, వర్కర్స్ ఫెడరేషన్ వారు కోరినట్లుగా వారి పక్షాన వేతనాలను పెంచుతూ ఎటువంటి లేఖలైనా జారీ చేయవద్దు. ఈ రోజు 03/08/2025 తేదీన ఫెడరేషన్ మీడియాకు విడుదల చేసిన లేఖకు సంబంధించి ఏవైనా వివరాల కోసం తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ని సంప్రదించగలరు.
 
గమనిక: వర్కర్స్ ఫెడరేషన్ పేర్కొన్న వేతన పెంపును తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అంగీకరించలేదు. అంటూ పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు