గడిచిన 114 రోజులుగా అలుపెరగకుండా పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్, ఆంధ్ర రాష్ట్రానికి తదుపరి సీఎం అవుతారని, ఇందులో ఎటువంటి సందేహాలు లేదని చెప్పారు వైకాపా ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో పండితులు. ప్రజల స్థితిగతులను తెలుసుకుని, వారి కష్టాలను తీరుస్తానంటూ నడుస్తున్న జగన్, ఆ పని చేయనున్నారని తెలిపారు. ఇదే చైత్ర మాసంలో రాముడు పట్టాభిషేకం చేసుకున్నాడని, మరో చైత్ర మాసంలో జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని జోస్యం చెప్పారు.
ఎవరైనా కష్టపడితే రాముడు గుర్తించి విలపిస్తాడని, అదే గుణం జగన్ మోహన్ రెడ్డిలో ఉందని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రజల హృదయాలను గెలుచుకునే వ్యక్తి ఆయనేనని అన్నారు. అన్ని వర్గాల్లోనూ ఆయనపై మక్కువ పెరుగుతోందని, ఇందులో ఎలాంటి సందేహం లేదని చెప్పారు. ఆయన రాష్ట్ర పాలనాధికారిగా ప్రజలకు మరింత సంక్షేమాన్ని దగ్గర చేయనున్నారని, ఇందులో ఎటువంటి సందేహం లేదని చెప్పారు.