కర్నాటకలో కాంగ్రెస్ విజయానికి బీజేపీపై వ్యతిరేకతే.. ఏపీలోనూ రిపీట్ : అచ్చెన్నాయుడు

సోమవారం, 15 మే 2023 (13:44 IST)
ఇటీవల కర్నాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికాగా, ఈ ఫలితాల్లో కాంగ్రెస్ విజయభేరీ మోగించింది. అధికార బీజేపీ చిత్తుగా ఓడిపోయింది. ఈ ఫలితాలపై ఏపీ రాష్ట్ర శాఖ టీడీపీ అధినేత కె.అచ్చెన్నాయుడు స్పందిస్తూ, కర్నాటకలో కాంగ్రెస్ విజయానికి బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకతే కారణమన్నారు. ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఉందన్నారు.
 
అందువల్ల ఇక్కడ కర్నాటక సీన్ రిపీట్ కానుందని ఆయన జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఏపీలోని జగన్ ప్రభుత్వం అన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉందని, వారంతా అదును కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. ప్రతిపక్ష నేతలతో పాటు టీడీపీ శ్రేణులను వేధించడం తప్ప ఈ ప్రభుత్వ మరేం చేయడం లేదని ఎద్దేవా చేశారు. 
 
సోమవారం టెక్కలి టీడీపీ శ్రేణులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనపై రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారన్నారు. టీడీపీ శ్రేణులను వేధించి కేసులు పెట్టడం మినహా మరేమీ చేయడం లేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కార్యకర్తలందరూ సైనికుల్లో పని చేయాలని ఆయన సూచించారు. జగన్ ప్రభుత్వాన్ని తరిమికొట్టే వరకు విశ్రమించవద్దని ఆయన పిలుపునిచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు