చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై తిరుపతిలో దాడి - video

ఠాగూర్

మంగళవారం, 14 మే 2024 (19:24 IST)
చంద్రగిరి టిడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై తిరుపతిలో దాడి జరిగింది. పద్మావతి విశ్వవిద్యాలయంలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ను ఆయన సందర్శించి తిరగి వస్తుండగా, అధికార వైకాపా కార్యకర్తలు ఈ దాడికి తెగబడ్డారు. దీంతో ఆయన స్పృహతప్పి పడిపోయారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు. 
 
ఏపీలో సోమవారం లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పులివర్తి నాని పోటీ చేయగా, వైకాపా నుంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పోటీ చేశారు. అయితే, తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించేందుకు వెళ్లారు. ఆ తర్వాత ఆయన తిరిగి వెళుతుండగా వైకాపా కార్యకర్తు దాడికి పాల్పడినట్టు టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. 
 
ఈ దాడిలో నాని భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. పులివర్తి నాని స్పృహతప్పి పడిపోయారు. దాడిలో పులివర్తి నాని కారును ధ్వంసం అయింది. కాగా ఈ దాడిని నిరసిస్తూ నాని, ఆయన అనుచరులు పద్మావతి వర్శిటీ రోడ్డుపై బైఠాయించారు. ఈ ఘటన జరిగిన గంట అవుతున్నప్పటికీ పోలీసులు మాత్రం ఇప్పటివరకు రాలేదని నాని అనుచరులు ఆరోపిస్తున్నారు. దాదాపు 150 మంది వైకాపా కార్యకర్తలు ఈ దాడిలో పాల్గొన్నారు. వాళ్ల వద్ద కత్తులు, గొడ్డళ్లు, కర్రలు ఉన్నట్టు నాని అనుచరులు ఆరోపిస్తున్నారు. 

CCTV Visuals

ఈరోజు చంద్రగిరిలో టీడీపీ ఇంఛార్జి పులివర్తి నాని మీద జరిగిన attack విజువల్స్#APElection2024 pic.twitter.com/YBTcEdyNql

— M9 NEWS (@M9News_) May 14, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు