రేపటి నుంచి శ్రీకాళహస్తిలో ఆడికృత్తిక ఉత్సవాలు

ఆదివారం, 1 ఆగస్టు 2021 (13:30 IST)
శ్రీకాళహస్తి పట్టణం విజ్ఞానగిరిపై వెలసిన శ్రీవళ్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆడికృత్తిక ఉత్సవాలు సోమవారం నిర్వహించనున్నారు.

ఏటా శ్రీకాళహస్తీశ్వరాలయ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను వైభవంగానిర్వహిస్తున్నారు. అయితే కరోనా ఉధ్రుతి తగ్గకపోవడంతో ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహించనున్నట్లు ముక్కంటి ఆలయ ఈవో పెద్దిరాజు స్పష్టం చేశారు.

మంగళవారం నారద పుష్కరాణిలో జరిగే తెప్పోత్సవం ఏకాంతంగానే జరగనుందని గుర్తుచేశారు. దీంతో ఉత్సవాలకు భక్తులను అనుమతించడంలేదని పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు