కడప జిల్లాలోని బద్వేల్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 30వ తేదీన ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్‌కు సంబంధించి 281 బూత్‌లను ఏర్పాటు చేశారు. పోలింగ్‌కు 1,124 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. పోలింగ్ రోజు ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా అధికార యంత్రాంగం పిలుపునిచ్చింది.
పోలింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు పోలీస్ శాఖ ప్రకటించింది. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ విజయరామరాజు పిలుపునిచ్చారు. అలాగే, బద్వేలు పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.