కొత్త నోట్లు... ప్రజలకు చుక్కలు చూపిస్తున్న బ్యాంకులు, కాఫీ తాగుతూ తాపీగా...

శనివారం, 12 నవంబరు 2016 (16:16 IST)
ప్రభుత్వం తెచ్చిన పాత నోట్లు రద్దు ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. చేతిలో పెద్ద నోట్లు ఉన్నా ఏమీ కొనలేని దయనీయ పరిస్థితి. సరే ఆ నోట్లను మార్చుకుందామని బ్యాంకులకు వెళితే బ్యాంకు అధికారులు తాపీగా కౌంటర్లలో కూర్చుని కాఫీలు తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఎంతమాత్రం ప్రజల గోడును పట్టించుకోవడంలేదు. ఉదయం 6 గంటలకే ప్రజలు క్యూల్లో నిలబడి ఉంటే, బ్యాంకు అధికారులు మాత్రం తాపీగా 10 గంటలకు వస్తున్నారు. 
 
మరోవైపు ATMలు ఎక్కడా తెరుచుకోలేదు. దీనితో పరిస్థితి మరీ ఇబ్బందికరంగా మారింది. ఇంకోవైపు కొత్తగా వచ్చిన రూ. 2000 నోటు తీసుకెళితే... ఆ నోటుకు చిల్లర లేదంటూ షాపులు చీదరించుకుంటున్నాయి. మొత్తమ్మీద ప్రజలకు మోదీ నిర్ణయం చుక్కలు చూపిస్తోంది. బ్యాంకర్లతో కేంద్ర ఆర్థిక మంత్రి నిరంతరం సమీక్షలు చేస్తున్నట్లు చెపుతున్నా... అది వాస్తవ రూపంలో మాత్రం కనిపించడంలేదు. ప్రజలు నోట్ల కష్టాలు వర్ణించనలవికావడంలేదు.

వెబ్దునియా పై చదవండి