స్థానిక కలెక్టరు క్యాంపు కార్యాలయంలో గృహనిర్మాణ శాఖ, ఆర్ డబ్ల్యూఎస్, పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ అధికారులతో కలెక్టరు ఇంతియాజ్ జాయింట్ కలెక్టరు(అభివృద్ది) శివశంకర్ తో కలసి తొలి దశలో నిర్మించే గృహనిర్మాణ పనులు పురోగతిపై డివిజన్ల వారీ సమీక్షించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నవరత్నాల్లో భాగంగా జిల్లాలో తొలి దశలో నిర్మించే 1,67,500 గృహాలకు సంబందించి ప్రభుత్వం రూ. 3 వేల 16 కోట్లు మంజూరు చేసిందన్నారు. లబ్దిదారుల గృహ స్థలాలకు సంబందించి రిజిస్ట్రేషన్లు, మ్యాపింగ్, జియోట్యాగింగ్ వంటి అంశాలు ఏమైనా పెండింగ్ లో ఉంటే అధికారులు సమన్వయంతో త్వరిత గతిన పూర్తి చెయ్యాలని ఆదేశించారు.
ఇళ్ల నిర్మాణానికి సిమ్మెంట్, ఇనుము, ఇసుక అందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని లబ్దిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా అధికారులు ప్రోత్సహించాలన్నారు. తొలిదశలో అర్హత పొంది కూడా ఇంటినిర్మాణం చేపట్టని లబ్దిదారులు ఎవరైనా ఉంటే వారి స్థానంలో వేరోకరికి అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశించారు.