అనంతరం 140వ వార్డు సచివాలయంలో జగన్ వ్యాక్సిన్ వేయించుకోనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఎంపీ మోపిదేవి, మేయర్ కావటి మనోహర్ నాయుడు, ఎమ్మెల్యే మద్దాలగిరి, జిల్లా అధికారులు పరిశీలించారు.
ఏపీలో కోవిడ్ వ్యాక్సినేషన్ ఏప్రిల్ 1నుంచి సచివాలయాల్లో అందుబాటులో తెస్తున్నాం. ఏప్రిల్ 1న 140వ వార్డు సచివాలయంలో సీయం జగన్ వ్యాక్సిన్ తీసుకుంటారు. ప్రజల్లో అపోహలు తొలగాలి. ప్రభుత్వ సలహాలు, సూచనలు ప్రజలంతా పాటించాలి అని అన్నారు.