ఎస్సై ప్రభాకర్ రెడ్డి వద్దకు రెండుసార్లు అమ్మాయిల్ని పంపాను: శ్రవణ్

బుధవారం, 28 జూన్ 2017 (09:51 IST)
హైదరాబాదులోని ఆర్జే స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడిన శిరీష కేసులో కస్టడీలోకి తీసుకున్న పోలీసులు మరోమారు శ్రవణ్‌ను విచారించారు. ఈ నేపథ్యంలో పలు కీలక విషయాలను శ్రవణ్ తెలిపినట్టు తెలుస్తోంది. తన ఫ్రెండ్‌ శిరీష, ఆమె స్నేహితుడు రాజీవ్‌ మధ్య విభేదాలు పెరిగిపోయాయని, వారిద్దరినీ అక్కడికి తీసుకొస్తానని, ఈ సమస్యను పరిష్కరించాలని ఎస్సై ప్రభాకర్ రెడ్డిని కోరినట్టు శ్రవణ్ తెలిపాడు.
 
అయితే ఈ వ్యవహారం రాజీవ్‌కు తెలియకుండా చూసుకుందామని కూడా అన్నాడని తెలుస్తోంది. పోలీసులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పని శ్రవణ్... కొన్నింటికి మాత్రమే సమాధానం చెప్పినట్లు సమాచారం. తొలిసారి ముగ్గురూ సిగిరెట్ తాగేందుకు వెళ్లగా, రెండోసారి కేవలం రాజీవ్‌ను మాత్రమే సిగిరెట్ పేరుతో బయటకు తీసుకొచ్చాడని చెప్పాడు. దీంతో ప్రభాకర్ రెడ్డి అత్యాచారయత్నం చేయడం జరిగినట్లు శ్రవణ్ వెల్లడించాడు. అలాగే రెండు సార్లు ఎస్సై ప్రభాకర్ రెడ్డి వద్దకు తాను అమ్మాయిలను పంపినట్టు శ్రవణ్ పోలీసులతో చెప్పాడని తెలుస్తోంది.  
 
మరోవైపు, ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య వెనుక ఉన్నతాధికారుల వేధింపులు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శిరీష ఆత్మహత్య కేసులో విచారణ మొత్తం తప్పుల తడకగా సాగుతోందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం తాము నిష్పాక్షికంగా, నిజాయతీగా దర్యాప్తు చేస్తున్నామని, ఎవరికైనా అనుమానాలుంటే తమను కలిస్తే వారి అనుమానాలు తీరుస్తామని చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి