దేశంలో అధికారంలో వున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేవలం ఆర్ఎస్ఎస్ సిదాంతాలచే నడపబడుతున్నదని ఏపిసిసి అధ్యక్షులు డా.సాకే శైలజనాధ్ రాష్ట్ర కార్యాలయం ఆంధ్ర రత్న భవన్ నుండి విలేకరుల సమావేశంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై దుయ్యబట్టారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం అబద్దాలు చెప్పటంలో దిట్టని, ప్రజలకు సత్యాన్నివిస్తరించకుండా దాచిపెట్టటంలోనే నిరంతరం పనిచేస్తున్నాయని, ఈ దేశ పౌరులకి, ఈ దేశ భద్రతకే ప్రమాదం వచ్చేలా కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుందని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతుంది.
బిజెపి ప్రభుత్వ పెద్దలు ఎంత నిస్సంకోచంగా అబద్దాలు చెప్తారు అనటానికి సాదృశ్యం నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశంలో సమాధానం లో ఆక్సిజన్ కొరత వలన చనిపోయిన వాళ్ళు ఒక్కరు లేరు అని చెప్పే అంత దుర్మార్గమైన ప్రభుత్వం అనే విషయాన్నీ గుర్తుచేస్తునామాని శైలజనాధ్ గుర్తుచేశారు.
కనీసం ఒక్కసారైనా ఈ మంత్రులు, వీళ్ళందరూ చనిపోయిన వాళ్ళ కుటుంబాలను పరామర్శిస్తే వీళ్లకు అర్ధమవుతుంది ఆ వ్యధ. భారతీయ జనతా పార్టీ నాయకులు చాలామంది కరోనాతో చనిపోయారు, అనేక మంది నాయకులు గుంపులు గుంపులుగా ఆ మాత యాత్రల్లో పాల్గొని ప్రాణాలు విడిచారు, ఇంత మంది చనిపోతే చివరికి ప్రజల ప్రాణాల పట్ల కూడా అబద్దాలు చెప్పేఅంత దైర్యం వున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని శైలజానాథ్ అన్నారు.
అంతేకాక ప్రజల ఆస్తుల్ని దోచుకునే విధంగా లేదా ప్రజల ఆస్తుల్ని అమ్మేయటంలో, ప్రజల ఆస్తుల్ని వాళ్ళకి కావాల్సిన కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ఏ మాత్రం వెనుకంజ వెయ్యారనటానికి నూటికి నూరుశాతం విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ అమ్మేయటమేనని, ఇటువంటి దుర్మార్గమైన భావాలు కలిగిన భారతీయ జనతా పార్టీ ఆ పార్టీ తోక ఆర్ఎస్ఎస్ ఈ రోజు దేశ భద్రతను నాశనం చేసే విధంగా ఈ దేశ పౌరుల ప్రాధమిక హక్కులకు భంగం కలిగేవిధంగా ప్రవర్తిస్తున్నారని ప్రపంచం కోడై కూస్తావుందని శైలజానాథ్ అన్నారు.
ప్రతి నిత్యం అబద్దాలు చెప్పే భారతీయ జనతా పార్టీ మరొక్క సారి అబధం చెప్పే ప్రయత్నం చేసింది అదే పెగాసుస్ రూపేనా ఇజ్రాయెల్ లో తయారయిన ఒక హ్యాక్ సాఫ్ట్వేర్. అంటే ఫోన్లు దొంగతనంగా వినటం, దొంగతనంగా మేనేజ్ చెయ్యటం, ఫోన్లతో దొంగతనంగా కంట్రోల్ చెయ్యటం కలిగి వున్న ఒక సాఫ్ట్వేర్ ని ఈ భారతదేశం లో వాడబడిందని శైలజానాథ్ తెలియజేసారు.
కర్ణాటకలో కుమారస్వామి, కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వం కుప్ప కూలటానికి కారణం ఈ దొంగ పనులకు నిదర్శనం. అలానే దేశ మాజీ సైనికాధికారులు, ఎలక్షన్ కమీషనర్లు వాళ్ళ సిబంది రాహుల్ గాంధీ మరియు వారి సిబ్బంది, సాక్ష్యాతూ సహచర మంత్రులపైనా ఈ ఫోన్ ట్యాపింగ్ చూస్తుంటే మోడీ - షా కి మాటవినని మంత్రులు అయివుంటారని అన్నారు.
ఇలా చెప్పుకుంటూపోతే ఎన్ని వేల నంబర్లు, పేర్లు బయిటికి వస్తాయో అర్ధం కావటంలేదని, ఇంత మంది పైన పెగాసస్ ద్వారా దొంగతనంగా ఆ ఫోన్లను హ్యాక్ చెయ్యటం, దొంగతనంగా వినడం అంటే చివరికి పెద్దలు చెప్పినట్లు మనం ఎక్కడ ఏం మాట్లాడుకున్న మనల్ని ఎవరో చూస్తున్నారు అనే భావాన్ని కలగజేసే కారణం చూస్తావున్నామని శైలజానాథ్ అన్నారు.
ఈ హాకింగ్ నిజాలని బయటికి తెచ్చే జర్నలిస్టులని అదపులో పెట్టుకునేందుకు జర్నలిస్టుల ఫోన్ లు కూడా హ్యాక్ చేయటం చూస్తుంటే దీన్ని ప్రజాస్వామ్యం హత్యగావించబడుతోందని దీనిని కాంగ్రెస్ పార్టీగా ఖండిస్తూ హెచ్చరిస్తున్నామని శైలజానాథ్ అన్నారు.
28 నవంబర్ 2019 ఇదే విషయం పైన పార్లమెంట్లో చర్చ వస్తే ఆ రోజున దాదాపు 121 పేర్లు హ్యాక్ కు గురిఅయ్యాయని, అనుమానం వున్నదని భారతీయ జనతా పార్టీ ఐటీ మంత్రి ఆ రోజు ప్రకటించారు.
సాక్ష్యాతూ కేంద్ర మంత్రి పార్లమెంట్లో ప్రకటించారని, ప్రజలంటే ఏ మాత్రం గౌరవం లేని, రాజ్యాంగం పట్ల విశ్వాసంలేని ఈ ప్రజావ్యతిరేక పార్టీ, వారి మంత్రులు హ్యాక్ జరగలేదని కేవలం కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా మాట్లాడుతుందని మాట్లాడటం చూస్తుంటే పాములకి రెండు నాలుకలు ఉంటాయని, ఎన్ని నాలుకలు వున్నాయో అర్ధంకాని పరిస్థితి ఈ భారతీయ జనతా పార్టీ, మోదీ ప్రభుత్వానిదని శైలజానాథ్ ఎద్దేవా చేశారు.
పెగాసస్ కంపెనీ వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ ని ప్రభుత్వాలకే అమ్ముతారని, మీరు చెప్పే అబద్దాలు చూస్తుంటే ఇక్కడ మీ బిజెపి ప్రభుత్వం కాకుండా ఏ ప్రభుత్వం ఉందొ చెప్పాలని లేదా నాగపూర్ లో ఏమన్నా ఇంకో ప్రభుత్వం వుందా అని చెప్పాల్సిన అవసరం వుందని అన్నారు.
భారతీయ జనతా పార్టీ ముసుగేసుకున్న ఆర్ఎస్ఎస్ కుట్రలేనాని, వందల కోట్ల వ్యవహారం ఈ పెగసెస్ చర్యలని ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలని చేస్తూ హిట్లర్ తరహా పరిపాలన చేయాలని, ఎవరేం చేస్తున్నారో ఎవరేం మాట్లాడుతున్నారో తాపత్రేయం పడుతూ తద్వారా ఈ దేశాన్ని, ఈ దేశ ప్రజలని కంట్రోల్ చేద్దాం అనే ఒక దురదృష్ట ఆలోచనని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయ పడతున్నదని శైలజానాథ్ అన్నారు.
మన దేశంలో గ్యాంజెస్ అనే ఒక ప్రొవైడర్ సర్వీస్ ఆపరేటర్ దీన్ని వాడారని వార్తలు వున్నాయి, మీరంతా పునీతులు అయితే మీకు ఏమి తెలియకపోతే సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసి ఎందుకు దీన్ని వించారణ సాగించారని అలాగే ఈ విషయం పైన సుప్రీమ్ కోర్ట్ యొక్క పర్యవేక్షణలో ఎందుకు విచారణ కమిటీని వేసి ముందుకు వెళ్లరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఈ దేశ హోంమంత్రిని ఎందుకు మీరు తప్పించారని? నిజంగా అమితాషా కి తెలియకుండా జరగదని, తక్షణం రాజీనామా చెయ్యాలని, అమితాషా హోంమంత్రిగా దీనికి పూర్తి భాద్యత వచించాలని, నరేంద్ర మోదీ గారు తక్షణమే ఈ అంశం పైన సుప్రీమ్ కోర్ట్ పర్యవేక్షణలో పార్లమెంట్ సంయుక్త కమిటీ వెయ్యమని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని, రోజు రోజుకి బిజెపి యొక్క అసలు రంగు భయటికొస్తుందని బిజెపికి ఎటువంటి మినహాయింపు ఉండదని ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ పైన, వాళ్ళ కెబినెట్ మంత్రుల పైన, ముఖ్యమంత్రుల పైన, విలేకర్ల పైన, భవిష్యత్తులో అవసరం అయితే ప్రజల మీద కూడా హ్యాకింగ్ చేస్తారు.
కాబట్టి దీనిపైన పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చెయ్యాలని కోరుతూ నరేంద్ర మోదీ అమితాషా జోడి ఈ దేశంలోని ప్రజలని వంచించటానికి, ఈ దేశంలో ప్రజల్ని రకరకాలుగా మాయమాటలు చెప్పి ఈ దేశాన్ని నాశనం చెయ్యటానికే కంకణం కట్టుకున్నట్లకు అనిపిస్తున్న విషయాన్ని తెలియజేస్తూ దీనికి నిరసనగా రేపు 10:30 గంటలకి రాష్ట్ర కార్యాలయం ఆంధ్ర రత్న భవన్ నుండి నిరసన ర్యాలీ గా రాజ్ భవన్ వరకు ఉంటుందని తెలియజేసారు.
ప్రజల సహకారాన్ని ఆర్జిస్తున్నాం, ప్రజా హక్కుల్ని ప్రజల జీవితాల్లో గోప్యతను ఈ దేశ భద్రతను కాపాడేందుకోసం రాహుల్ గాంధీ నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ సాగిస్తావున్నా ఈ మహా యజ్ఞంలో ప్రజలయొక్క సహకారాన్ని కోరుకుంటూ నరేంద్ర మోదీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అమితాషా గారిని తక్షణమే తప్పించాలని డిమాండ్ చేస్తున్నాం.