నిమ్మగడ్డ నేర్పిన నీతి ఏమిటి? బీజేపీ నేత విష్ణువర్ధన్ ప్రశ్న

శుక్రవారం, 31 జులై 2020 (10:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనరుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తిరిగి నియమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం గురువారం అర్థరాత్రి ఉత్తర్వులు జారీచేసింది. తొలుత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరుతో ఓ ప్రకటన జారీచేసింది. ఆ తర్వాత నిమ్మగడ్డను తిరిగి ఎస్‌ఈసీగా నియమిస్తున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ ఉత్తర్వులు జారీ చేశారు.
 
దీనిపై ఏపీకి చెందిన పలువురు రాజకీయ నేతలు స్పందిస్తున్నారు. అలా బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఉన్నారు. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. నిమ్మగడ్డ నేర్పిన నీతి ఏంటి? అని ప్రశ్నిస్తూనే మన వ్యవస్థలు పెద్దపెద్ద నేతలనే లొంగదీశాయని, మనమెంత? అని అన్నారు.
 
నిమ్మగడ్డ పోస్టును పునరుద్ధరిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయాల్సి వచ్చిందని, మెల్లమెల్లగా మబ్బుల్లోంచి నేల మీదకు దిగి వస్తున్నారని అన్నారు. రాక తప్పదని, ఇదీ అదేనంటూ ట్వీట్ చేశారు. దీనికి ప్రభుత్వం విడుదల చేసిన జీవోను జత చేశారు. 

 

నిమ్మగడ్డ నేర్పిన నీతి ఎంటి?

మన వ్యవస్థలు అంతే... గతంలో పెద్ద పెద్ద నేతలనే లొంగదీశాయ్.మనము ఎంత...? నిమ్మగడ్డ పోస్టు పునరుద్ధరిస్తూ నోటిఫికేషన్ జారీ చేయాల్సి వచ్చింది.
మెల్లిమెల్లిగా మబ్బుల్లో నుంచి నేల మీదకు దిగివస్తున్నారు.రాకతప్పదు.ఇదీ అదే. pic.twitter.com/ttzQcqlhiQ

— S. Vishnu Vardhan Reddy (@SVishnuReddy) July 31, 2020

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు