జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించనున్నారు. ఇంతకీ ఆయన ఆంధ్రావాదా? లేక సమైక్య వాదా? అన్న విషయం తేల్చాలని విజయవాడ నగర బీజేపీ శాఖ డిమాండ్ చేసింది.
పవన్ కళ్యాణ్‌కు నిజంగా ఆంధ్రప్రదేశ్ అంటే అభిమానముంటే వెంటనే ఆయన హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలిరావాలని సవాల్ చేసింది. ఏపీ అభివృద్ధిపై ఆయనకు చిత్తశుద్ధి ఉంటే విశాఖపట్నంలో సినీ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు రావాలని కోరింది.
రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీపై పవన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేసింది. కాస్తంత అవగాహన పెంచుకుని మాట్లాడితే బాగుంటుందని సూచించింది.
కేంద్రమంత్రి వెంకయ్య నాయుడిపై ఆయన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని సీనియర్ నాయకుడు, నేషనల్, స్టేట్ కౌన్సిల్ సభ్యుడు ఎల్ఆర్కే ప్రసాద్ స్పష్టం చేశారు.