సీఎం జగన్ ఢిల్లీ టూర్‌లో స్టీల్ ప్లాంట్ - పోలవరం అంశాలు ప్రస్తావించలేదు : జీవీఎల్

బుధవారం, 5 జనవరి 2022 (13:18 IST)
భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు ఏపీ ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, తాజాగా సీఎం జగన్ చేపట్టిన ఢిల్లీ యాత్రపై ఆయన స్పందించారు. సీఎం జగన్ పర్యటనలో పోలవరం, స్ట్రీల్ ప్రైవేటీకరణ వంటి కీలక అంశాలను ప్రస్తావించినట్టు తాను ఎక్కడా వినలేదన్నారు. 
 
అయితే, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే మాత్రం కేంద్రమే దాన్ని పూర్తి చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధి కేంద్రానిదేనని ఆయన చెప్పారు. ఇక విభజన హామీలు అమలు, ప్రాజెక్టుల పనితీరు పరిశీలన కోసం ఆయన విశాఖలో పర్యటిస్తున్నారు. 
 
పనిలోపనిగా ఏపీలోని కాపులపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వాల్లో కాపులు అన్ని విధాలుగా నష్టపోయారని చెప్పారు. కాపులకు న్యాయం జరిగేది ఒక్క బీజేపీతోనే అని ప్రకటించారు. ఇక ప్రజాగ్రహ సభ తర్వాత టీడీపీ, వైకాపా గుండెల్లో రైళ్లు పరుగెత్తాయని చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు