Nandamuri Tejaswini, Nandamuri Balakrishna, Brahmani
నందమూరి బాలక్రిష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతోన్న అఖండ 2 సినిమా గురించి నిర్మాత, బాలక్రిష్ణ కుమార్తె తేజస్విని గొప్ప స్టేట్ మెంట్ పోస్ట్ చేసింది. అఖండ 2 అనేది సినిమా కాదు. ఫెస్టివల్ ఆఫ్ సినిమా అంటూ తెలియజేసింది. కథాపరంగా అందరినీ కట్టిపడేసే ఈ చిత్రంపై భారీ అంచనాలు ప్రేక్షకులు, అభిమానుల్లో వున్నాయి. అందుకే దీనిపై సాంకేతిక సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారు. రీరికార్డింగ్, వి.ఎఫ్.ఎక్స్ వంటి ఇతర టెక్నిల్ పరంగా అత్యున్నత స్థానంలో వుండాలనే పనిచేస్తున్నారు.