హరిత విప్లవాలూ, క్షీర విప్లవాలూ, సాంకేతిక విప్లవాలూ.. ఇలా మన సమాజం చాలా ముందుకు వెళ్లిపోయి ఒక చోట ఆగిందిప్పుడు. అదే.. సెక్స్ వివ్లవం. కుటుంబ బంధనాలను అవలీలగా తెంచుకున్న పిల్లలు బయటి సమాజంలోని స్వేచ్ఛను సరిగా అర్థం చేసుకోలేనితనమో లేక ఇలాంటి అవకాశాలు అనుభవించడానికి దొరికితే వదులుతామా అనే మొండిధైర్యంతోనూ కానీ సులభంగా పక్కదార్లు పడుతున్నారు. ఇంజనీరింగ్ చదివిన అమ్మాయి సైతం ఆపోజిట్ సెక్సుతో ఆకర్షణలు ఎక్కడ మొదలై ఎక్కడికి దారితీస్తాయో తెలీనితనంతో ఒక వెధవకు తన సర్వస్వాన్ని అర్పించేసింది. దాని ఫలితం ఏమిటంటే బ్లాక్ మెయిల్. వాడు ఆమెను ఎలా కావాలంటే అలా వాడుకుని రహస్యంగా ఫోటోలు తీసి బెదిరించడం మొదలుపెట్టాడు.ఆరులక్షలిస్తావా .. నెట్‌లో మనిద్దరం కలిసి ఉన్న ఫొటోలు పెట్టమంటావా అంటూ వేధిస్తే... తట్టుకోలేక ఇంట్లోనుంచి అయిదు లక్షల 72 లక్షలు దొంగతనం చేసి వాడికి అర్పించింది. తీరా తల్లిదండ్రులు ఇంట్లో లేని డబ్బు గురించి ఆరా తీస్తే విషయం బయటపడింది. మొత్తానికి అసలు గ్రంథసాంగుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు షరా మామూలుగా వెతుకుతున్నారని వార్తలు.
పోలీసులు వివరాలు మేరకు నెల్లూరు నగరంలోని మహాత్మాగాంధీనగర్‌లో నివాసం ఉండే ఒక ముస్లిం కుమార్తె బీటెక్ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో మూడు సంవత్సరాల క్రితం జ్యోతినగర్ మసీదువీధిలో ఉంటున్న షేక్ అల్లాభక్షుతో పరిచయం ఏర్పడింది. అల్లాభక్షుతో యువతితో సన్నిహితంగా ఉండే ఫొటోలు ఆమెకు తెలియకుండా తీశారు. తనకు రూ.6 లక్షలు డబ్బులు కావాలంటూ యువతిని బ్లాక్‌మెయిల్ చేసి బెదిరింపులకు దిగాడు.
తన వద్ద అంత నగదు లేదని చెప్పడంతో అల్లాభక్షు తన వద్ద ఉన్న ఫొటోలు నెట్‌లో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడు. వారం రోజుల్లో నగదు ఇవ్వకుంటే రోజుకు రూ.50 వేలు లెక్కన అధికంగా ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించాడు. దీంతో భయభ్రాంతురాలైన యువతి ఇంట్లో తెలియకుండా రూ.5,72 లక్షల నగదును బీరువాలో నుంచి తీసింది. సోమవారం యువతిని ఫోన్ ద్వారా తాను చెప్పినట్లు నడుచుకోవాలని సూచించాడు. నిప్పో సెంటర్ వద్ద స్కూటీని నిలిపి అక్కడి నుంచి ఆటోలో గాంధీబొమ్మ వద్దకు రావాలన్నాడు.
ఓ మొబైల్ దుకాణంలో రూ.30 వేలు విలువ చేసే శ్యామ్‌సంగ్ ఫోను కొని ఆత్మకూరు బస్టాండు వద్ద ఉండే రైల్వేబ్రిడ్జ్ వద్దకు చేరుకుంది. అక్కడికి చేరుకుని అల్లాభక్షుకు సెల్‌ఫోన్, రూ.4 లక్షలు నగదు ఇచ్చింది. ఫొటోలు ఉన్న పెన్‌డ్రైవ్‌ను అల్లాభక్షు యువతికి ఇచ్చి వెళ్లిపోయాడు. యువతి కుటుంబసభ్యులు ఇంట్లో కనిపించని నగదు విషయమై ఆమె ప్రశ్నించగా జరిగిన విషయం వివరించింది. కుటుంబసభ్యుల సహకారంతో యువతి ఐదో నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ మంగారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.