స్మార్ట్‌గా మసాజ్ ముసుగులో అసభ్య ప్రవర్తన

గురువారం, 22 సెప్టెంబరు 2022 (09:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్మార్ట్ సిటీలుగా అభివృద్ది చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటి. ఇక్కడ మసాజ్ సెంటర్లు (స్పా) కోకొల్లలుగా వెలుస్తున్నాయి. అధికారుల నుంచి అనుమతి పొందిన స్పా సెంటర్ల సంఖ్య పదో పన్నెండో ఉంటే అనధికారికంగా సుమారు 50 నుంచి 80 వరకు ఉన్నట్లు సమాచారం. మసాజ్‌తో పాటు ఇక్కడ అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీంతో ఇటీవల పోలీసులు వరుసగా నిర్వహించిన దాడుల్లో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.
 
నగరంలో బాడీ ససాజ్ పేరుతో ఈ స్పా సెంటర్లకు ఒక్కసారిగా గిరాకీ పెరిగిపోయింది. పైగా, వీటిపట్ల అత్యధిక మంది ఆకర్షితులవుతున్నారు. యువతను ఆకర్షించేందుకు యువతులను సిబ్బందిగా నియమిస్తున్నారు. నగరానికి చెందిన వారితో పాటు ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా పలువురుని తీసుకొచ్చి పని చేయిస్తున్నారు. 
 
యుకులే లక్ష్యంగా కళాశాలల వద్ద విస్తృతంగా ప్రచారం చేస్తున్ారు. కేవలం బాడీ మసాజ్ మాత్రమే కాకుండా ఇతరాత్రా సేవలు పేరిట కొందరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇందుకు రూ.3 వేల నుంచి రూ.8 వేల వరకు వసూలు చేస్తున్నారు. కేవలం మసాజ్‌కు అయితే రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారు. సీనియర్ సిటజన్లను సైతం ఆకర్షించేందుకు వారికి ప్రత్యేక సర్వీసుల పేరిట కూడా వల విసురుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు