మంత్రి ఎంత తిడుతున్నా చైర్మన్ ఏ ప్రతిస్పందనా వ్యక్తం చేయకుండా ప్రశాంతంగా వింటూ ఉండిపోయారు. ఆ సమయంలో నేను అడ్డుపడి మంత్రిని కొంత వెనక్కు నెట్టాను. మేం లేకపోతే చైర్మన్‌పై మంత్రి దాడి చేసేవారేమోనని అనిపించింది. ఇంతలో భద్రతా సిబ్బంది వచ్చి చైర్మన్‌ను కార్లో ఎక్కించి పంపారు’’ అని చెప్పారు.