Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

దేవీ

సోమవారం, 18 ఆగస్టు 2025 (11:20 IST)
Nidhi Agarwal looks
నిధి అగర్వాల్ రెబల్ స్టార్ ప్రభాస్ "రాజా సాబ్" చిత్రంలో నటిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆమె పుట్టినరోజు సందర్భంగా మూవీ టీమ్ బర్త్ డే విశెస్ తో స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో దేవుడిని ప్రార్థిస్తున్న నిధి అగర్వాల్ స్టిల్ ఆకట్టుకుంటోంది. కొద్ది రోజుల క్రితం రిలీజ్ చేసిన "రాజా సాబ్" టీజర్ లో నిధి అగర్వాల్ క్యారెక్టర్ ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేసింది. ఈ మూవీలో నిధి అగర్వాల్ అందంతో పాటు నటనకు అవకాశమున్న ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కనిపించనుంది.
 
"రాజా సాబ్" మూవీ తన కెరీర్ కు ఎంతో ప్రత్యేకంగా భావిస్తోంది నిధి అగర్వాల్. ఈ సినిమాతో తాను మరింతగా ప్రేక్షకుల అభిమానం సంపాదించుకుంటానని ఆశిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న "రాజా సాబ్" సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్నారు. ఈ సినిమా త్వరలో హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం.. ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
 
ఇదిలా వుండగా, మరో హారర్ థ్రిల్లర్‌ కి సైన్ చేశారు నిధి అగర్వాల్. ఇందులో లీడ్ రోల్ లో చేస్తుంది. ఈ చిత్రాన్ని జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ కింద శ్రీ పుప్పాల అప్పల రాజు (ఎ.ఆర్.) నిర్మిస్తున్నారు, ఇది వారి ప్రొడక్షన్ నంబర్ 1. ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌తో దర్శకుడిగా నిఖిల్ కార్తీక్.ఎన్ అరంగేట్రం చేస్తున్నారు.  
 
ప్రొడ్యూసర్ పుప్పాల అప్పల రాజు మాట్లాడుతూ.. నిధి అగర్వాల్ తన క్యారెక్టర్ కి అద్భుతమైన చార్మ్ తీసుకోస్తున్నారు. ఈ సినిమా ఆమె కెరీర్ లో ఓ మైలురాయి అవుతుంది. మా ప్రొడక్షన్ హౌస్ లో ఆమె జాయిన్ అవ్వడం మాకు ఆనందం కలిగిస్తోంది. ఆమె బిగ్ స్క్రీన్ పై చూపించబోయే మేజిక్ కోసం మేమంతా ఎదురుచూస్తున్నాం.
 ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ త్వరలో రాబోతున్నాయి. టైటిల్ దసరా సందర్భం గా రివీల్ చేస్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు