వారిద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. గత రెండేళ్లుగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం జరుగుతూ వచ్చింది. ఈ విషయం పెద్దలకు తెలియడంతో వారు పెళ్లి చేయాలని నిశ్చయించారు. ఇరు కుటుంబాల పెద్దల అనుమతితో మరికొన్ని నిమిషాల్లో ముహుర్తం ఉండగా, పెళ్లి కొడుకు జంప్. దీంతో ఆ వధువు బోరున విలపిస్తోంది. ఎంతో గాఢంగా ప్రేమించిన తనను ఇందుకు ఎలా చేశాడో అర్థం కావడం లేదని వాపోతోంది. ఈ వివరాలను పరిశీలిస్తే...
శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేటకు చెందిన ప్రదీవ్ స్వామ, రాజ్యలక్ష్మిలు పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలను కూడా మెచ్చి, వారికి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారు. పెద్దలంతా మాట్లాడుకోని పెళ్లి ముహూర్తం ఖరారు చేసుకొని, బంధుమిత్రులందరినీ పిలిచి, వైభవంగా వేడుకనిర్వహిస్తున్నారు. ఈ ఏర్పాట్లన్నీ స్థానికంగా ఉండే సూర్యనారాయణ స్వామి కల్యాణ మండపంలో చేశారు.
పెళ్లి ముహూర్తం దగ్గరపడుతుండడంతో పెళ్లి తంతులో భాగంగా నిర్వహించాల్సిన ఇతర కార్యక్రమాల కోసం పురోహితుడు పెళ్లికొడుకుని తీసుకురండీ అని చెప్పాడు. అయితే, వరుడి బంధువులకి పెళ్లికొడుకు కనిపించడకుండా పోయాడు. అయితే, పెళ్లి కొడుకు వచ్చేస్తాడని వధువు బంధువులు ఒక గంట కాలం కాలక్షేపం చేశారని చెప్పారు. వరుడి ఫోను కూడా స్విచ్‌ఆఫ్ వచ్చిందని తెలిపారు. తనను ప్రేమికుడు చివరి నిమిషంలో ఇలా ఎందుకు చేశాడో తనకు అర్థం కావడం లేదని వధువు రాజ్యలక్ష్మి చెప్పింది.