కరోనా కారణంగా వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఏపీకి వచ్చిన సాఫ్ట్ వేర్ ‘టెక్కీ'లు, ఉద్యోగుల కోసం బ్రాడ్ బ్యాండ్ సేవలు విస్తరించాలని రాష్ట్ర ఐటి శాఖామంత్రి యుతులు మేకపాటి గౌతంరెడ్డి నిర్ణయించారు.
ముఖ్యంగా మన దేశంలోనే వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, వివిధ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు కరోనా బారిన పడకుండా సురక్షితంగా ఉండవచ్చని... ఒకవేళ కరోనా సోకినా కూడా ఏపిలో ఉంటే వైద్య సేవలు ప్రభావవంతంగా అందుతాయన్న ఉద్దేశంతో స్వంత రాష్ట్రానికి వచ్చి వారి వారి ఇంటి నుంచే తమ ఉద్యోగ విధులు నిర్వహిస్తున్నారు.