అమరావతిలో హైటెక్ సెక్స్ రాకెట్.. గంటకు రూ. 10వేలు.. సోషల్ మీడియాతో బిజినెస్ అప్?

సోమవారం, 19 సెప్టెంబరు 2016 (17:33 IST)
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతమైన అమరావతిలో హైటెక్ సెక్స్ రాకెట్ నడుస్తున్నట్లు కొన్ని టీవీ ఛానల్స్ ప్రసారం చేస్తున్నాయి. ఈ రాకెట్‌కు సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకుంటున్నట్లు సదరు ఛానల్స్ వెల్లడించాయి. వాట్సాప్ ద్వారా అమ్మాయిల ఫోటోలను పంపించి హైటెక్ సెక్స్ రాకెట్‌ను నడుపుతున్నట్లు ఓ టీవీ ప్రసారం చేసింది. ఈ రాకెట్లో మోడల్స్, యాంకర్లు కూడా ఉన్నట్లు సమాచారం. 
 
రాజధానిగా ముస్తాబవుతున్నా ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా గుంటూరు, విజయవాడల్లో అపార్ట్‌మెంట్ కల్చర్ పెరిగిపోవడం ద్వారా సెక్స్ రాకెట్ సీక్రెట్‌గా సాగిపోతోందని.. ఇందుకు టెక్నాలజీని బాగానే వాడుకుంటున్నారని కొన్ని వార్తా పత్రికలు కూడా ఆడియో ఆధారాలతో బయటపెట్టాయి. అమ్మాయితో గడిపేందుకు ఓ రేటు... వారితో షికార్లకు వెళ్ళేందుకు వేరే రేటు చెల్లించాల్సి వుంటుంది. 
 
గంటకు రూ.10వేల వరకూ సెక్స్ రాకెట్ దుండగులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. మరి రాజధాని ప్రాంతాల్లో ఇలాంటి అక్రమాలు చోటుచేసుకోవడంపై సీఎం చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

వెబ్దునియా పై చదవండి