తిరుమలలో గంజాయి అక్రమ రవాణా కలకలం రేపుతోంది. లక్ష్మీ శ్రీనివాసం కార్పొరేషన్ సంస్థ తరపున వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి వద్ద 125 గ్రాముల గంజాయి పట్టుబడింది. కాంట్రాక్ట్ ఉద్యోగి గంగాధరాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకుని తనిఖీ చేయగా చిన్న చిన్న గంజాయి ప్యాకెట్లు లభించాయి. కాంట్రాక్ట్ ఉద్యోగి గంగాధరాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకుని తనిఖీ చేయగా గంజాయి వ్యవహారం బయటపడింది.
ఈ ఘటనపై పవిత్రమైన తిరుమల కొండపై గంజాయి రవాణా జరుగుతుండటంపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పరమ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి పరిస్థితి అత్యంత ఆవేదన కలిగిస్తోందని ట్వీట్ చేశారు. రాష్ట్రంలో గంజాయి భూతం రోజురోజుకూ విస్తరిస్తోంది అనడానికి ఇదో సాక్ష్యం. భక్తుల మనోభావాల విషయంలో ప్రభుత్వం బాధ్యతగా స్పందించాలని డిమాండ్ చేశారు.