'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

ఠాగూర్

ఆదివారం, 31 ఆగస్టు 2025 (14:37 IST)
టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సినీ ప్రయాణంలో 50 వసంతాలు పూర్తి చేసుకుని అరుదైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఈ శుభతరణంలో బాలకృష్ణను అభినందిస్తూ సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. బాలకృష్ణ ఒక పాజిటివ్ శక్తి అని, ఆయన ఉన్న చోట సంతోషం, నవ్వులు వెల్లివిరుస్తాయని కొనియాడారు. ఈ మేరకు తన శుభాకాంక్షలను ఒక ప్రత్యేక వీడియో సందేశం ద్వారా పంచుకున్నారు.
 
ఈ వీడియోలో రజనీకాంత్ మాట్లాడుతూ.. "బాలయ్య అంటేనే పాజిటివిటీ. ఆయనలో కొంచెం కూడా నెగెటివిటీ కనిపించదు. 'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు', 'కత్తితో కాదురా కంటి చూపుతో చంపేస్తా' వంటి పవర్ఫుల్ డైలాగులు కేవలం బాలకృష్ణ చెబితేనే అందంగా ఉంటాయి" అని ప్రశంసించారు. బాలకృష్ణకు పోటీ మరెవరో కాదని, ఆయనకు ఆయనే పోటీ అని రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
 
బాలకృష్ణ సినిమా వస్తుందంటే కేవలం ఆయన అభిమానులేకాకుండా, సాధారణ ప్రేక్షకులు కూడా థియేటర్లకు వస్తారని, అదే ఆయనకున్న బలమని తెలిపారు. "సినిమా పరిశ్రమలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం గొప్ప విషయం. ఇందుకు నా హృదయపూర్వక అభినందనలు. ఆయన మరో 25 ఏళ్లు ఇలాగే నటిస్తూ 75 ఏళ్ల మైలురాయిని కూడా అందుకోవాలి. సంతోషంగా ఉండాలి. లవ్ వ్యూ బాలయ్య" అంటూ రజనీకాంత్ తన సందేశాన్ని ముగించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు