పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, రాయపూడి, నేలపాడు, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డు, 14వ మైలులో రైతులు ధర్నాలు చేస్తున్నారు. మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.
నల్లబెలూన్లతో రైతుల నిరసన
తాడికొండ అడ్డరోడ్డులో రైతులు ఆందోళన నిర్వహించారు. ఏపీకి మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా, అమరావతిని ఏపీ రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
రాజధాని 13 జిల్లాలకు చెందిన సమస్య: సీపీఎం
అమరావతి రాజధాని 29 గ్రామాల సమస్య కాదు, 13 జిల్లాలకు చెందిన సమస్య అని సీపీఎం నేత బాబూరావు అన్నారు. విజయవాడ ధర్నాచౌక్‌లో మహిళలు చేపట్టిన 24 గంటల దీక్షకు ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు.