తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రధాని అమలుచేయాలి : లక్ష్మీనారాయణ

వరుణ్

ఆదివారం, 25 ఫిబ్రవరి 2024 (10:21 IST)
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోక ముందు చేసిన వాగ్దానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏమైందని ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ ఉక్కు పరిశ్రమను మూసి వేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైందని ఆయన నిలదీశారు. 
 
ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను నేతలు అమలు చేయాలని ఆయన కోరారు రాజకీయ పార్టీలు రాష్ట్ర అభివృద్ధికి పాటుపడడం లేదని ఆయన విమర్శించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ పాలన గురించి ప్రజలు ఏమని ప్రశ్నిస్తున్నారో తెలుసుకోవాలని ఆయన కోరారు. సౌత్ ఇండియా జేఏసీ నేత చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ  ప్రజల హక్కులను ప్రభుత్వాలు కాల రాయాలని చూస్తే సహించేది లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర హక్కులను, రాయలసీమ హక్కులను, ఆంధ్రప్రదేశ్ హక్కులను కేంద్ర ప్రభుత్వం కాపాడాలని ఆయన కోరారు. 
 
రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. రెండు రాష్ట్రాలు విడిపోక ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రులు గుర్తుంచుకోవాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆయన విమర్శించారు. రెండు రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు ఇచ్చిన హామీలను, ప్రజల హక్కులను కాల రాస్తే ప్రజల ఆగ్రహం తప్పదని హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల హక్కులను విభజన హామీలను అమలు చేయడం లేదని ఆయన విమర్శించారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రానికి వంట గ్యాస్‌ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి తరలించబోతున్నాడని ఇక తెలుగు రాష్ట్రల ప్రజలకు గ్యాస్ అందించడం లేదని ఆయన విమర్శించారు. దేశ రాష్ట్ర రాజకీయాలు ముందు స్వార్థంతో కూడిన విమర్శ చేస్తున్నారే తప్ప అమలు చేయడం లేదని ఆయన విమర్శించారు. 13 కోట్ల ప్రజల హక్కులను కాపాడాలని ఆయన కోరారు. ఎన్నికల్లో అమలు చేసిన హామీలను ఎందుకు అమలు చేయలేదో ఈ ఎన్నికల్లో ప్రజలు ప్రశ్నించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో విభజన హామీలు అమలు చేయాలని కోరారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు