విశాఖపట్టణం ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం ప్రైవేటుపరం చేయాలన్న నిర్ణయం తీసుకుంది. దీన్ని వ్యతిరేకంగా సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా కేంద్రం తరపున హాజరైన న్యాయవాది విచిత్ర వాదనలు వినిపించారు. వ్యాజ్యం దాఖలు చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశాఖ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారని.. రాజకీయ లబ్ధి కోసమే పిటిషన్ వేశారని కౌంటర్‌లో పేర్కొన్నారు. అందువల్ల లక్ష్మీనారాయణ పిల్‌కు విచారణ అర్హత లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.